నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సంతపేట వద్ద ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణమాసం రెండవ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు వాసనాభి గిరిబాబు తెలిపారు. తెల్లవారుజామునే ముత్తైదువులు ఆలయానికి చేరుకోవడంతో కుంకుమార్చనలు చేపట్టామని వివరించారు. సాయంత్రం కూడా ఇవి కొనసాగుతాయన్నారు.