శ్రీకాకుళం జిల్లా ఏపీటీఎఫ్ కార్యవర్గ ఎన్నిక మంగళవారం సాయంత్రం జరిగింది. ఎన్నికల అధికారులుగా ఈశ్వరరావు, మధుసూదన రావు వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా ఎం.బుజంగరావు, ప్రధాన కార్యదర్శిగా బుక్కురు వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. తాను గతంలో కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు.