నరసన్నపేట నియోజకవర్గ వైస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ విషయాన్ని పార్టీ సమన్వయకర్త ధర్మాన కృష్ణచైతన్య గురువారం తన కార్యాలయంలో తెలిపారు. 'బాబు షూరిటీ - మోసం గ్యారంటీ' అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.