మందసరాధాకృష్ణపురం గ్రామానికి చెందిన ఆర్మీ హవల్దార్ లొళ్ల జోగారావు (36) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. గ్రామస్థులందరూ పాల్గొని భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. విశాఖ నుంచి ఆర్మీ అధికారులు, ఎచ్చెర్ల నుంచి రిజర్వ్ పోలీస్ దళం గౌరవ వందనం చేసి, సంతాప సూచికగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.