శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ కిడ్నీ ఆసుపత్రిలో దారుణమైన చోరీ జరిగింది. అనారోగ్యంతో చేరిన నారాయణమ్మ అనే మహిళ మెడలోని పావు తులం బంగారపు పుస్తెలు, రూ. 3 వేల నగదు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో మాయమయ్యాయి. ఇదే వార్డులోని మరో రోగి వద్ద నుంచి రూ. 300 కూడా చోరీకి గురైనట్లు సమాచారం. ఆసుపత్రిలో భద్రతా లోపం, సిబ్బంది నిర్లక్ష్యంపై రోగులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి భద్రత కల్పించాలని, దొంగలను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు.