పలాస మండలంలో నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీల వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. గరుడకండి జంక్షన్ వద్ద టీడీపీకి చెందిన వారు శుభాకాంక్షలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గురువారం గుర్తుతెలియని వ్యక్తులు అవి చించివేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాశిబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.