కాశీబుగ్గ పలాస మున్సిపాలిటీ పరిధిలోని పూజారి వీధిలో ఉన్న రాధాకాంత చెరువు వద్ద బుధవారం కార్తిక పౌర్ణమి వేడుకలు పోలీసుల పహారా మధ్య ఘనంగా జరిగాయి. మహిళలు అరటి పువ్వులు, ధోన్నెలతో దీపాలను వెలిగించారు. ఉదయం 3 గంటల నుంచి చెరువులో దీపారాధన చేసి, కేదాలీశ్వరుడికి పాలు, రకరకాల పూలు, పండ్లతో పూజలు చేశారు. పేరంటాలకు బొట్లు పెట్టి, పలదానం ఇచ్చి పుచ్చుకున్నారు. హిందువులలో అత్యంత పవిత్రంగా భావించే కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహించారు.