కాశీబుగ్గ ఆలయం మూసివేత

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండాను గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. తొక్కిసలాటపై విచారణ కొనసాగుతోంది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత పోస్ట్