కాశీబుగ్గ: యువకుడి ఆత్మహత్య

కాశీబుగ్గ రోటరీ నగర్ లో గురువారం రాత్రి భార్యతో గొడవపడి మనస్తాపానికి గురైన డి. మహేశ్ (25) అనే యువకుడు ఇంట్లో పంకాకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వజ్రపుకొత్తూరు మండలం బెండికి చెందిన మహేశ్, కాశీబుగ్గలో భార్య జ్యోత్స్నతో కలిసి నివసిస్తూ ఓ కొరియర్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం తండ్రి సింహాచలం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్