కోటబొమ్మాళి: చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం

కోటబొమ్మాళి మండలంలో మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న బలివాడ మోహనరావు (46) శుక్రవారం నిమ్మాడ కూడలి తిలారు రహదారిలోని ఓ తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండేళ్లుగా మానసికంగా ఇబ్బంది పడుతున్న మోహనరావు గతంలోనూ పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. మోహనరావుకు భార్య హేమలక్ష్మి, ఎనిమిదేళ్ల కుమార్తె రోజిత ఉన్నారు.

సంబంధిత పోస్ట్