బుధవారం మందస మండలం హరిపురం రైల్వే లైన్ సమీపంలో ఆర్మీ హవల్దార్ జోగారావు (36) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. జమ్మూలో విధులు నిర్వహిస్తున్న ఆయన, ఇటీవల సెలవులకు ఇంటికి వచ్చారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.