మందస: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు పంపిణీ

మందస మండలం హరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. పాఠశాలహెచ్ఎం బొడ్డేపల్లి గోపీనాధం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మూడు వీల్ చైర్స్, రెండు రొలెటర్స్, ఒక ట్రై సైకిల్ ను అందజేశారు. ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నదన్నారు.

సంబంధిత పోస్ట్