పలాస నియోజకవర్గం మందస మండలం రాంపురం, గంగువాడ గ్రామాలలో చేపట్టనున్న కార్గో ఎయిర్ పోర్ట్ వద్దంటూ వామపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. వామపక్ష నేత చాపర వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. తక్షణమే ఎయిర్ పోర్ట్ విధానాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భారీ ర్యాలీ నిర్వహించారు.