మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదేశాల మేరకు జులై 16వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మందసలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీపీ డొక్కరి దానయ్య, మండల పార్టీ అధ్యక్షులు దల్లి జానకి రావులు పేర్కొన్నారు. ఆదివారం మందసలో పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. 'బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమంను పల్లె పల్లెలో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.