మందస మండలం రట్టి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 13 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఇదే గ్రామం నుండి 38 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారని ఎంఈఓ ఎం లక్ష్మణరావు తెలిపారు. మంగళవారం రాత్రి గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో, ఆ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారు.