మందస: పోలీస్ జాగిలాలతో తనిఖీలు

మందస పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో పలు దుకాణాలలో శనివారం పోలీస్ జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మందస ఎస్ఐ కె. కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ నిల్వలు, క్రయ విక్రయాలు, రవాణా అరికట్టే చర్యలలో భాగంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి, ఇతర నార్కోటిక్ డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్