మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలను మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరెడ్డి గురువారం పర్యవేక్షించారు. మందస మండలం బుడంబో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ను పరిశీలించారు. పేరెంట్స్ సమావేశాలను అందరూ కలిసి జయప్రదం చేయాలని సూచించారు. ఫోటోలు, వీడియోలు వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వై వెంకటరమణ , వెలుగు ఏపిఎం పైడి కూర్మారావు, ఉపాధి హామీ ఏపీవో హరికృష్ణ పాల్గొన్నారు.