మందస మండలంలోని బాలిగాం పంచాయతీలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వెలుగు ఐటిడిఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ పైడి కూర్మా రావు మాట్లాడుతూ అర్హులందరికీ ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షుడు భావన దుర్యోధన, గ్రామ సంఘం అధ్యక్షురాలు కె. శైలజ, ఇటీవల భర్తలను కోల్పోయిన వితంతువులకు కొత్తగా మంజూరైన పింఛన్లను అందజేశారు.