మహిళలను ఉద్దేశించి ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును బుధవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలాసలోని తన నివాసం నుంచి ఏబీఎన్ కార్యాలయం వైపు వెళ్తున్న సమయంలో కాశీబుగ్గ పోలీసులు అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు.