శనివారం పలాసలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటనలకు సంబంధించి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందిస్తామని, ఘటనపై ఆరా తీస్తామని మంత్రి తెలిపారు.