పలాస మండలం జాతీయ రహదారి కొబ్బరి ఊరు ప్రాంతంలో లారీ ఢీకొనడంతో సాయికుమార్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సోంపేట మండలం తాళభద్రకు చెందిన సాయికుమార్ ద్విచక్ర వాహనంపై హరిపురం వైపు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడికి 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి పలాస ప్రభుత్వ సామాజికాసుపత్రికి తరలించారు.