మందస సిడిపిఓగా పెద్దింటి అరుణ బాధ్యతల స్వీకరణ

మందసలో ఐసీడీఎస్ సిడిపిఓగా పెద్దింటి అరుణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో కొమరాడ ఐసీడీఎస్ ప్రాజెక్టులో సూపర్వైజర్‌గా ఉన్న ఆమె పదోన్నతితో ఈ పదవికి వచ్చారు. గత సిడిపిఓ వసుంధర దేవి సోంపేట బదిలీపై వెళ్లగా, డి. రాధ మాధవిని ప్రభుత్వ ఉత్తర్వులతో బాపట్లకు పంపారు. సిడిపిఓ లేకపోవడంతో ప్రాజెక్టు అస్తవ్యస్తంగా సాగినట్టు, అంగన్వాడీ సెంటర్ల పర్యవేక్షణ తగ్గినట్టు ఆరోపణలు వచ్చాయి. అరుణ నియామకంతో పరిస్థితులు మెరుగవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్