శ్రీకాకుళం జిల్లా ఇలిసిపురం గ్రామంలో శ్రీ భద్ర మహంకాళి అమ్మవారి దేవర పండగ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 12 గంటలకు అమ్మవారి పవిత్ర తిరువీధి ఘనంగా ప్రారంభం కానుంది. మెయిన్ రోడ్ అంతా అద్భుతమైన విద్యుత్ అలంకరణలతో ప్రకాశవంతంగా తీర్చిదిద్దబడింది. ఇలిసిపురం మొత్తం పండగ శోభతో సుందరంగా అలంకరించబడింది. భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.