శ్రీకాకుళం జిల్లా, పలాస, పాతపట్నం పరిధిలోని మెళియాపుట్టి మండలం, బురదపేట–జోడూరు మార్గమధ్యంలో గుర్తు తెలియని వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి సమయంలో రోడ్డు పక్కన పడివున్న వృద్ధుడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి వయస్సు సుమారు 65-70 ఏళ్లు ఉండవచ్చని, వివరాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.