వజ్రపుకొత్తూరు: అభివృద్ధి సంక్షేమమే కూటమి ధ్యేయం: ఎమ్మెల్యే

అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. గురువారం వజ్రపుకొత్తూరు మండలంలోని గరుడుభద్ర పంచాయతీలో గల మర్రిపాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడుతుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్