కూన రవికుమార్‌పై వైసీపీ నేత దూషణలు: టీడీపీ ఫిర్యాదు

ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్‌పై వైసీపీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ చేసిన వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలపై టీడీపీ నేతలు గురువారం ఆముదాలవలస పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చింతాడ రవికుమార్ వైల్డ్ ప్రవర్తనతో అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. చింతాడపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరగా, ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్