విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని లచ్చయ్యపేట గేటు వద్ద ఆదివారం రాత్రి రైలు నుంచి జారి పడి శ్రీకాకుళం జిల్లా పొందూరు రామ్మోహన్ కాలనీకి చెందిన బి. శివశంకర్ (33) అనే యువకుడు మృతి చెందాడు. అతని వద్ద లభించిన టికెట్ ఆధారంగా, అతను పార్వతీపురం నుంచి విశాఖపట్నం వైపు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.