హిర మండలం దేవారశెట్టి, అంగురు కాలనీలలో వీధి కుక్కలు గురువారం ఉదయం 10 మందిపై దాడి చేశాయి. బజార్‌కు వెళ్తున్న వారిని వెంటపడి కాళ్లపై కరవడంతో గాయాలపాలయ్యారు. స్థానికులు కుక్కలను తరిమేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గాయపడిన వారికి పీహెచ్‌సీలో వైద్యులు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేశారు.