పాతపట్నంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో గురువారం శక్తి టీమ్ ఇన్‌చార్జ్ గిరిధర్ నేతృత్వంలో శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళా భద్రత ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి తన మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచిస్తూ, ఈ యాప్ సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు.