ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడంతో ఉపాధి హామీ వేతనదారులు చల్లని సమయాలలోనే పనులకు హాజరు కావాలని మెలియాపుట్టి ఏపీవో రవి అన్నారు. ఆయన మెలియాపుట్టి మండలంలోని సుందరాడ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం నాడు పరిశీలించారు. త్రాగునీరు కచ్చితంగా తీసుకురావాలని, సమయపాలన పాటిస్తూ పనులు చేయాలని తద్వారా నిర్దిష్ట వేతనం లభిస్తుంది అన్నారు ఆయనతోపాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.