పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలోని పలు గ్రామాలలో 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని టీడీపీ నాయకులు తెలియజేశారు. శనివారం సాయంత్రం పలువురు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయో స్వయంగా అడిగి తెలుసుకున్నామని, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బూత్ ఇన్చార్జీలు పాల్గొన్నారు.