హిరమండలం: రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల రహదారులను అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. బుధవారం హిరమండలం మండలం నౌతల నుండి శ్రీముఖలింగం వరకు నిర్మిస్తున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణానికి ఎస్ఏఎస్సీఐ నిధులతో నాలుగు కోట్ల 35 లక్షల రూపాయలు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్