కొత్తూరు: వినీలాకాశంలో మెరిసిన హరివిల్లు

కొత్తూరు మండల కేంద్రంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. ఇదే సమయంలో నీలి మేఘాల్లో అద్భుతమైన ఇంద్రధనస్సు కనిపించింది. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. మరికొందరు తమ సెల్ ఫోన్లలో ఈ అద్భుతమైన చిత్రాన్ని బంధించారు.

సంబంధిత పోస్ట్