కొత్తూరు: ఒక్కసారిగా భారీ గాలులతో దంచి కొట్టిన వర్షం

కొత్తూరు మండల కేంద్రం వసప, నివగాం, మాతల, బమ్మిడి, కుంటిభద్ర, మదనాపురం, మహర్తాపురం గ్రామాల్లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం ఉక్కపోతతో బాధపడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఖరీఫ్ పంటలకు ఉపయోగపడుతుందని, వర్షాభావంతో ఆందోళనలో ఉన్న రైతులకు ఇది ఊరటగా మారిందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్