కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే దిశగా రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. గురువారం పాతపట్నం మండలం బురగాం లో ఆయన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు హాజరయ్యారు. ఈ పుస్తకాలతో రైతులకు ఎంతో భరోసా కలుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొన్నారు.