పాతపట్నం: నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం

కూటమి ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు, వికలాంగులకు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం పాతపట్నం మండలం సూర్యనారాయణ పురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్