పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు శనివారం మధ్యాహ్నం "సుపరిపాలనలో తొలిఅడుగు" కార్యక్రమంలో కొత్తూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అగతముడి మాధవరావు, మండలంలో వివిధ బూతుల్లో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి పాలన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు అగతముడి అరుణ్, ముగితి కృష్ణ, లక్షణ, రాము, రామరావు తదితర నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.