పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాలలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లను ఆధునికరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విన్నవించారు. శనివారం విజయవాడలోని అసెంబ్లీ జీరో అవర్లో రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డిని ఆయన కలుసుకుని, ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. బస్టాండ్లతోపాటు, నియోజకవర్గంలో ఉన్న ఇండోర్ స్టేడియం మరమ్మతులకు నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.