సారవకోట ఎంఈఓ మడ్డు వెంకటరమణ, ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు అవార్డు పొందిన డోకిపర్తి షణ్ముఖరావు సేవలను కొనియాడారు. గురువారం ఆయన 13వ వర్ధంతి సందర్భంగా పాతపట్నం మండలం కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం షణ్ముఖరావు పరితపించేవారని, ఆయన స్ఫూర్తితో ఎంతోమంది ఉన్నత స్థానాల్లో నిలిచారని గుర్తు చేశారు.