పాతపట్నం మండలం బురగాంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని మహిళ ఓ మగబిడ్డకు జన్మనిచ్చి, సత్యనారాయణస్వామి ఆలయం సమీపంలోని పొదల్లో వదిలి వెళ్లింది. అటుగా వెళ్లిన భూదేవి అనే మహిళ ఆ శిశువును చూసి రాత్రంతా సంరక్షించింది. మంగళవారం విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు శిశువును స్వాధీనం చేసుకుని శ్రీకాకుళంలోని శిశు గృహానికి అప్పగించారు.