పాసి గంగుపేట గ్రామానికి చెందిన బండి రవివర్మ పాతపట్నం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) అధ్యక్షునిగా నియమితులయ్యారు. గతంలో ఆయన బైదలాపురం ప్రాథమిక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా, గుమ్మగెడ్డ నీటి సంఘం అధ్యక్షునిగా సేవలందించారు. ఇచ్చిన బాధ్యతను నిస్వార్థంగా నిర్వర్తిస్తానని రవివర్మ సోమవారం తెలిపారు.