పాతపట్నం మండలం మల్లిపురం గ్రామానికి చెందిన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఏనుగుతల చలపతిరావుకు మంగళవారం రూ. 82,384 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన చలపతిరావు, ఎమ్మెల్యే ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిరుపేదలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.