పాతపట్నం మండలంలోని సోదా గ్రామం వద్ద బుధవారం లగేజీ ఆటో బోల్తా పడింది. ఆటో డ్రైవర్ వెంకట్రావు తన మేనల్లుడు డి. యశ్వంత్‌తో కలిసి వెళ్తుండగా, రహదారి గుంతలమయంగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యశ్వంత్ ఎడమ కాలు విరిగిపోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, అతన్ని పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.