పాతపట్నం నియోజకవర్గంలోని సీతారామపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసిన ఆయన, గత ఏడాదిలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, వచ్చే నాలుగేళ్లలో పూర్తి స్థాయి సంక్షేమాన్ని అందిస్తామన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా విని అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.