పోలాకి మండలం మబగాం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పంపిణీ చేశారు. శనివారం నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన బిశెట్టి త్రినాధమ్మకు రెండు లక్షల రూపాయలు, పొదిలాపు శివరాజుకు లక్షా ఇరవై వేల రూపాయల చెక్కులను అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందించేందుకు సీఎంకు దరఖాస్తు చేయగా ఈ నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.