పాతపట్నంలో ట్రాక్టర్ బోల్తా..తప్పిన ప్రమాదం

పాతపట్నం పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం సివిల్ సప్లై బియ్యం బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. మెళియాపుట్టి నుంచి బియ్యం లోడ్‌తో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్టర్ వేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బియ్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి.

సంబంధిత పోస్ట్