వైసీపీ అరాచకత్వంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శలు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, వైసీపీ మీడియా సంస్థలపై భౌతిక దాడులు చేయడం ద్వారా తమ అరాచక స్వభావాన్ని బహిర్గతం చేసిందని అన్నారు. హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని ఖండించారు. ప్రశ్నలు అడిగితే దాడులు చేయడం, దౌర్జన్యాలకు దిగడం వైసీపీ బలహీనతకు సంకేతమని, వారి విధివిధానాలు రాష్ట్ర ప్రజలకు స్పష్టమయ్యాయని, ఇప్పుడు పక్క రాష్ట్రాలకు విస్తరించడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం లోని కేంద్ర మంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది.

సంబంధిత పోస్ట్