ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 సర్వీసు పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ జారీ చేసింది. హైకోర్టు వ్యాజ్యాలు కొట్టేసిన నేపథ్యంలో, పోస్టుల ప్రాధాన్యతలకు సంబంధించి అభ్యర్థుల నుంచి మరోసారి ఐచ్ఛికాలను స్వీకరించాలని కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికే డీఎస్సీ, ఇతర ఉద్యోగ నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు నాన్ విల్లింగ్ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. జనవరి 4వ తేదీ రాత్రి 10 గంటలలోపు నాన్ విల్లింగ్ ఫామ్‌ను సమర్పించవచ్చు. ఇది ఐచ్ఛికమేనని, తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. పోస్టుల ప్రాధాన్యత ఐచ్ఛికాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇవ్వనుంది. గ్రూప్ 1 క్రీడాకోటా అభ్యర్థులకు జనవరి 7న సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.