వంగర - రాజాం రహదారిలో శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. వంగర నుండి రాజాం ఊక లోడుతో వెళ్తున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. కాగా పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి లారీ ఆగింది. ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ కు ఫిట్స్ వచ్చినట్లు స్థానికులు తెలిపారు.