కాలేజ్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

ఎల్.ఎన్.పేట మండలం తురకపేట సెంటర్ పరిధిలోని అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం ప్రమాదం తప్పింది. హిరమండలం కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేట్ కళాశాల బస్సు విద్యార్థులను తీసుకెళ్లేందుకు శ్యామలాపురంలోని వంశధార పునరావాస కాలనీకి చేరుకుంది. అక్కడ నలుగురు విద్యార్థులను ఎక్కించుకున్న అనంతరం తిరిగి హిరమండలం వైపు వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఓ విద్యార్థికి స్వల్ప గాయాలు కాగా, మిగతా విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్